: 'కంచె' ఆడియో విడుదల తేదీ, వేదిక మార్చాం: వరుణ్ తేజ్


మెగా ఫ్యామిలీ స్టార్ వరుణ్ తేజ్ తాజా సినిమా ఆడియో వేడుక తేదీ, వేదిక మారినట్టు ప్రకటించాడు. ఫేస్ బుక్ మాధ్యమంగా వరుణ్ తేజ్ ఈ ప్రకటన చేశాడు. వైవిధ్య భరితంగా రూపొందిన ట్రైలర్ తో మహేష్ బాబు, రానా, నాని వంటి నటులను ఆకట్టుకున్న 'కంచె' ఆడియో వేడుకను ఈ నెల 26న విశాఖపట్టణంలో నిర్వహించాలని వరుణ్ తేజ్ భావించాడు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల విశాఖపట్టణంలో 'కంచె' ఆడియో వేడుక నిర్వహించడం లేదని, అక్టోబర్ 2న హైదరాబాదులో ఈ వేడుక నిర్వహించనున్నామని ఫేస్ బుక్ లో పేర్కొన్నాడు. కాగా, 'కంచె' సినిమాకు క్రిష్ దర్శకుడు.

  • Loading...

More Telugu News