: ఐవీఆర్ఎస్ ద్వారా టి.టీడీపీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడి ఎన్నిక
తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడి ఎన్నికను ఆ పార్టీ సరికొత్తగా చేపట్టబోతోంది. విజయవాడలో ఈరోజు తెలంగాణ టీడీపీ నేతలతో జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నుకోవాల్సిన అధ్యక్షుడి ప్రస్తావన వచ్చింది. ఈ సమయంలోనే ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) ద్వారా అధ్యక్షుడిని ఎంపిక చేయాలనుకుంటున్నట్టు చంద్రబాబు చెప్పారట. ఈ క్రమంలో కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేపడతారు. దాంతో ఈసారి టీటీడీపీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనే విషయంపై ఉత్కంఠ ఏర్పడనుంది.