: పంచ్ కు నేలకూలిన బాక్సర్
బాక్సింగ్ రింగ్ లో ప్రత్యర్థి విసిరిన పంచ్ కు సిడ్నీకి చెందిన బాక్సర్ డేవీ బ్రౌన్ మృతి చెందాడు. న్యూసౌత్ వేల్స్ లో జరిగిన రీజనల్ బాక్సింగ్ టైటిల్ పోరులో సిడ్నీ బాక్సర్ డేవీ బ్రౌన్ కు ప్రత్యర్థి బలమైన పంచ్ ఇచ్చాడు. పంచ్ తగలగానే కుప్పకూలిన బ్రౌన్ ఇక లేవలేదు. దీంతో అతనిని హుటాహుటీన స్థానిక అధికారులు ఆసుపత్రికి తరలించారు. అతనికి వైద్యం అందిస్తుండగా మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. కాగా, బలమైన పంచ్ తగలడంతో అతని మెదడుకు గాయమైందని, దాని కారణంగానే డేవీ బ్రౌన్ మృతి చెందాడని వారు వెల్లడించారు.