: జైల్లో ఇంద్రాణి ముఖర్జీని కలసిన బ్రిటన్ బృందం


సంచలనాత్మక షీనా బోరా హత్య కేసులో రిమాండ్ లో ఉన్న ఇంద్రాణి ముఖర్జీని బ్రిటన్ బృందం ఈ రోజు జైల్లో కలిసింది. కొంతకాలంగా బ్రిటీష్ పౌరసత్వం కలిగి వున్న ఆమెకు జైల్లో అందుతున్న సహాయ సహకారాలు, వసతులు గురించి అడిగి తెలుసుకునేందుకు ఆ దేశానికి చెందిన ఓ బృందం నేడు ఇంద్రాణిని కలిసింది. అంతకుముందు జైల్లో ఆమెను కలిసేందుకు ముంబైలోని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషన్ బృందానికి అనుమతి ఇవ్వలేదు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని జైలు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఢిల్లీలోని బ్రిటీష్ హైకమిషన్ అధికారులను ముంబై బృందం సంప్రదించడంతో ఇంద్రాణిని కలిసేందుకు అవకాశం లభించింది. కాగా బోరా కేసులో ఇంద్రాణికి బ్రిటన్ బృందం న్యాయ సహాయం చేసే అవకాశం ఉందని ఆ మధ్య వార్తలు వచ్చాయి.

  • Loading...

More Telugu News