: మగధీరను తలచుకుని భయపడ్డా: ప్రిన్స్ మహేశ్ బాబు


రికార్డుల సునామీ సృష్టించిన చిత్రం 'మగధీర'. ఆ చిత్రం గుర్తొచ్చి ప్రిన్స్ మహేశ్ బాబుకు భయమేసిందట. ఈ విషయాన్ని స్వయంగా మహేశే తెలిపాడు. ‘శ్రీమంతుడు చిత్రం రిలీజ్ ముందు రోజు చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే, సూపర్ హిట్ సినిమా మగధీర తర్వాత రెండు నెలల పాటు ఏ సినిమా విజయవంతం కాలేదు. మళ్లీ బాహుబలి తర్వాత కూడా అదే పరిస్థతి ఉంది. ఇవన్నీ గుర్తుకువచ్చి కొంచెం టెన్షన్ గా ఫీలయ్యాను. శ్రీమంతుడు ఎంత వసూలు చేసిందనే విషయం ప్రస్తుతం అవసరంలేదు. కాకపోతే, శ్రీమంతుడు బిగ్ హిట్ అయింది. చాలా హ్యాపీగా ఉంది’ అని ప్రిన్స్ మహేష్ బాబు చెప్పాడు.

  • Loading...

More Telugu News