: టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడ్డ టీడీపీ నేత... రేవంత్ రెడ్డిని చూడాలని కలవరింత!
టీఆర్ఎస్ కార్యకర్తల గొడ్డళ్ల దాడిలో టీడీపీ నేత రామావత్ చందూలాల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్గొండ జిల్లాలోని చంద్రంపేట మండలం చంద్రునాయక్ తండాలో రెండు రోజుల క్రితం జరిగింది. చందూలాల్ పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆసుపత్రి నుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. భూవివాదాల వల్లే ఈ దాడి జరిగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చందూలాల్ టీడీపీ నేత రేవంత్ రెడ్డిని చూడాలని కలవరిస్తున్నాడని పార్టీ వర్గాల సమాచారం.