: వరంగల్ జిల్లాలో పోలీసులు, మావోల మధ్య కొనసాగుతున్న కాల్పులు
వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం వెంగలాపూర్ అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. గత ఐదు గంటలుగా ఈ కాల్పులు జరుగుతున్నాయి. బయ్యక్కపేట అడవిలో మావోలు మందుపాతర పేల్చి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కేకే డబ్ల్యూ కార్యదర్శి దామోదర్ దళం తప్పుకుందని, ప్రస్తుతం ఆ దళాన్ని పోలీసులు చుట్టుముట్టినట్టు సమాచారం. దాంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల్లో ఇప్పటికే ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. వారు కేకే డబ్ల్యూ కమిటీ సభ్యులుగా గుర్తించారు.