: ముస్లిం మత సదస్సులో అర్ధ నగ్న నిరసన
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో 'మహిళలు- ఇస్లాం' అంశంపై సదస్సు జరుగుతోంది. వేదికపై ఇమాంల ప్రసంగాలు కొనసాగుతున్నాయి. ఇంతలో ట్యునీషియా, అల్జీరియాకు చెందిన ఇద్దరు మహిళలు అర్ధ నగ్నంగా మారి వేదికపైకి దూసుకొచ్చి 'నాకెవరూ ఆదేశాలు ఇవ్వలేరు. నాకు నేనే ప్రవక్తను' అంటూ ఒంటి మీద రాసుకొచ్చి, అవే నినాదాలు చేశారు. దీంతో ఇమాంల మద్దతుదారులు వేదికపైకి దూసుకొచ్చి, వారిని లాగిపడేశారు... ఈడ్చికొట్టారు. ఇంతలో జోక్యం చేసుకున్న పోలీసులు, వారిని బయటకు తీసుకెళ్లారు. అయితే ఆ సదస్సులో 'మీరు మీ భార్యలను కొట్టాలా? వద్దా?' అనే అంశంపై చర్చ జరుగుతోందని, దీంతో ఇమాంల ముందు నిరసనగా అర్ధనగ్న ప్రదర్శన చేయాల్సి వచ్చిందని నిరసనకారులు చెబుతున్నారు.