: వేలానికి సిద్ధమైన డైనోసార్ అస్థిపంజరం
జురాసిక్ కాలానికి చెందిన అరుదైన డైనొసార్ అస్థిపంజరాన్ని లండన్ లో వేలం వేయనున్నారు. వేలంలో ఈ అస్థిపంజరం రూ. 51 కోట్ల (భారత కరెన్సీలో)కు అమ్ముడుబోతుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ డైనోసార్ అమెరికాలో లభ్యమైంది. అరుదైన రకానికి చెందిన ఈ డైనోసార్ పళ్లు కత్తుల్లా పదునుగా ఉన్నాయి. డైనోసార్ అస్థిపంజరం పొడవు దాదాపు 8 మీటర్లు ఉంది. ఇలాంటి అరుదైన డైనోసార్ అస్థిపంజరాన్ని యూకేలో వేలం వేయడం ఇదే తొలిసారి.