: లైంగిక దాడులూ ఉగ్రవాదమే: ప్రీతిజింటా
అత్యాచారాల నిరోధం విషయంలో భారతీయులు అనుసరిస్తున్న వైఖరిని నటి ప్రీతిజింటా తీవ్రంగా విమర్శించారు. ఢిల్లీలో చిన్నారిపై క్రూర దాడి నేపథ్యంలో ఆమె ఒంటి కాలిపై లేచారు. ''ఇలాంటివి జరిగినప్పుడు భారతీయుల స్పందన చాలా తక్కవ కాలం పాటే ఉంటుంది. మనకు జ్ఞాపకాలు కొన్ని రోజులే ఉంటాయి. ఇలాంటి ఘటన జరిగినప్పుడు స్పందిస్తాం. నిరసనలు తెలియజేస్తాం. ట్రాఫిక్ ను స్తంభింపజేస్తాం. కొన్ని రోజుల తర్వాత ఇంటికెళ్లి నిద్రపోతాం'' అంటూ మన తీరును ప్రీతి కడిగి పారేసింది. ఇలాగైతే అలాంటి దాడులను నిరోధించడం అసాధ్యమని తేల్చి చెప్పింది. లైంగిక దాడులను ప్రీతి ఉగ్రవాదంతో పోల్చింది. ఇది దేశీయ ఉగ్రవాదమని, మహిళలపై దాడి చేసేవారు ఉగ్రవాదులేనని మండిపడింది.