: 'గురువు' చెప్పినా సహకరించని భార్య... తప్పుబడుతూ, విడాకులు మంజూరు చేసిన కోర్టు


భర్త కోరుకున్న విధంగా లైంగిక జీవితాన్ని అందించడంలో విఫలమైన భార్య చర్యలను తప్పుబడుతూ, ముంబైలోని బాంద్రా సెషన్స్ కోర్టు ఓ యువకుడికి విడాకులు మంజూరు చేసింది. ఆసక్తికరమైన ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే, బాధిత యువకుడికి 2011లో వివాహం అయింది. సాధ్యమైనంత త్వరగా పిల్లలను కనాలన్నది అతని కోరిక. ఆమె మాత్రం అందుకు నిరాకరించింది. తొలిరాత్రే ప్యాకెట్ల కొద్దీ కండోములు తీసుకొచ్చిందట. తనకు పిల్లలు వద్దని తెగేసి చెప్పిందట. ఆపై ఆమె గురువు దగ్గరకు తీసుకెళ్లి హితబోధ చేయించినా, పద్ధతి మార్చుకోలేదు. దీంతో విసిగిపోయిన అతడు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. తన భర్త అసహజ శృంగారాన్ని కోరుతున్నాడని కోర్టులో ఆమె వాదించింది. ఆమె ఆరోపణలను నమ్మని కోర్టు, ఆమె వాదన సరిగ్గా లేదని అభిప్రాయపడింది. ఈ కేసులో భర్త మానసిక వేదన కనిపిస్తోందని, ఆయన విడాకులు పొందేందుకు అర్హుడని న్యాయమూర్తి ఎస్ఏ మోరే అభిప్రాయపడ్డారు. వివాహం చేసుకుని సుఖపడాలన్న యువకుడి కోరికలు కల్లలయ్యాయని కూడా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News