: గండేపల్లి మృతులకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలంటూ ఆందోళన


తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి లారీ ప్రమాద మృతుల నష్టపరిహారం విషయంలో ఆందోళన జరుగుతోంది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించాలంటూ రిపబ్లికన్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పులి ప్రసాద్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. పుష్కరాల్లో చనిపోయిన వారికి పది లక్షలు ఇచ్చారని, నిరుపేదలైన వలస కూలీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చేవరకు మృతదేహాలను తరలించబోమని చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. ఈ క్రమంలో వీరు కుటుంబ సభ్యులతో కలసి ఆందోళన చేస్తున్నారు.

  • Loading...

More Telugu News