: గబ్బర్ సింగ్ ను చూస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలి: ఆనం
సర్దార్ గబ్బర్ సింగ్ ను చూస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని కాంగ్రెస్ నేత ఆనం వివేకానందరెడ్డి తెలిపారు. ఓ టీవీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్దార్ గబ్బర్ సింగ్ చిటికేస్తే చాలు, చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు. ఎంతో రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు భయం వెనుక కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నానని ఆనం తెలిపారు. తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని, కాంగ్రెస్ ను వదిలిపోవాలనుకుంటే తన భాష మారుతుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఫీనిక్స్ పక్షి అని, దానికి మరణం అంటూ లేదని ఆయన వివరించారు. తాను రఘువీరారెడ్డిని విమర్శించడం లేదని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి ఎదురెళ్లేంత పిచ్చోడిని కాదని ఆనం వివేకా తెలిపారు.