: పరాజయమన్నదే లేకుండా కెరీర్ ముగించిన బాక్సింగ్ ఛాంపియన్


రెండు దశాబ్దాల కెరీర్ లో పరాజయమన్నదే ఎరుగని బాక్సింగ్ ఛాంపియన్ మేవెదర్ చివరి మ్యాచ్ లో కూడా విజయం సాధించి రిటైర్మెంట్ ప్రకటించారు. కెరీర్ లో 49 విజయాలు సాధించిన మేవెదర్ అధికారికంగా రెండోసారి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2008లో రిటైర్మెంట్ ప్రకటించినా మరోసారి రింగ్ లోకి దూకి విజయాలు సాధించాడు. లాస్ వెగాస్ లో ఆండ్రీ బెర్టోతో జరిగిన పోరులో విజయం సాధించిన అనంతరం బాక్సింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని ఫ్లాయిడ్ మేవెదర్ తెలిపాడు. తాజా విజయంతో బాక్సింగ్ హెవీ వెయిట్ లెజెండ్ రాకీ మార్కియానో రికార్డు సమం చేసిన మేవెదర్, ప్రపంచ వెల్టన్ వెయిట్ టైటిల్ గెలుచుకున్నాడు. మేవెదర్ తదుపరి లక్ష్యం హాలీవుడ్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అతని చేతిలో ఇప్పటికే పలు సినిమా అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News