: దర్శకుడు కొరటాల శివ ప్రత్యేక పూజలు
ఇటీవల విడుదలై, కలెక్షన్లు కురిపిస్తున్న 'శ్రీమంతుడు' చిత్ర దర్శకుడు కొరటాల శివ ఖమ్మం జిల్లాలోని వీరభద్రస్వామి ఆలయాన్ని ఈ రోజు ఉదయం సందర్శించారు. బూర్గంపాడు మండలంలోని మోతెగడ్డ దీవిలో ఉన్న ఈ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబసభ్యులతో కలిసి భద్రాచలం పుణ్య క్షేత్రానికి వచ్చిన ఆయన ఈ ఆలయాన్ని కూడా దర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు సాదరపూర్వక స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఇరవెండి ఉపసర్పంచ్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.