: వరంగల్ జిల్లాలో పిచ్చికుక్కల స్వైర విహారం
పిచ్చికుక్కలు ప్రజలకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. రోజురోజుకీ వాటి దాడులు పెరిగిపోతున్నాయి. వరంగల్ జిల్లా మరిపెడ మండలం జయ్యారం గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారంతో 8 మంది గాయాలపాలయ్యారు. గాయపడ్డవారిలో ముసలివారు కూడా ఉన్నారు. బాధితులను మహబూబాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గతంలో పిచ్చికుక్కల దాడిలో ముగ్గురు చనిపోయిన సంఘటన తలచుకుని గ్రామస్తులు భయపడిపోతున్నారు. పిచ్చికుక్కల బారి నుంచి తమను కాపాడాలంటూ సంబంధిత శాఖాధికారులను గ్రామస్థులు వేడుకొంటున్నారు.