: యూఎస్ ఓపెన్ 'క్వీన్' పెన్నెట్టా... వరుస సెట్లలో విన్సీ చిత్తు
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా ఇటలీ క్రీడాకారిణి ప్లానియో పెన్నెట్టా నిలిచింది. కొద్దిసేపటి క్రితం ముగిసిన మహిళల సింగిల్స్ ఫైనల్ లో ‘నల్ల కలువ‘ సెరెనా విలియమ్స్ కు సెమీస్ లో షాకిచ్చిన రాబెర్డో విన్సీపై పెన్నెట్టా వరుస సెట్లలో సునాయసంగా విజయం సాధించి విజేతగా నిలిచింది. మ్యాచ్ ప్రారంభంలో విన్సీ నుంచి గట్టి పోటీ ఎదురైనా చెమటోడ్చిన పెన్నెట్టా 7-6, 6-2 స్కోరుతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. అసలేమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పెన్నెట్టా, విన్సీలు ఎదురైన ప్రత్యర్థులందరికీ షాకిస్తూ ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే.