: బీజింగ్ లో చారిత్రాత్మక ప్రాంతాలను సందర్శించిన కేసీఆర్


ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం బీజింగ్ లో చారిత్రాత్మక, పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ముఖ్యంగా అక్కడ ఉన్న 'ఫర్ బిడెన్ సిటీ'ని కేసీఆర్ బృందం సందర్శించింది. ఈరోజు తీరిక లేకుండా గడిపిన కేసీఆర్ అక్కడి పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కేసీఆర్ బృందం కలిసిన కంపెనీ ప్రతినిధులలో చైనా ఫార్చూన్ ల్యాండ్ డెవలప్ మెంట్ కంపెనీ వారు కూడా ఉన్నారు. తెలంగాణా రాష్ట్రంలో ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి ఫార్చూన్ ల్యాండ్ కంపెనీ ఆసక్తి కనబరిచినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News