: ఒకటి కాదు నాలుగు సిలిండర్లు పేలాయి.. 82కి చేరిన మృతుల సంఖ్య


మధ్యప్రదేశ్ లోని జబువా జిల్లా కేంద్రంలోని హోటల్లో పేలింది ఒక సిలిండరు కాదు, నాలుగు సిలిండర్లు. తాజా సమాచారం ప్రకారం ఆ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 82కు చేరింది. రెండంతస్తుల రెస్టారెంట్ కుప్పకూలిపోవడంతో సుమారు 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. పేలుడు సంభవించడంతో మృతి చెందిన వారి సంఖ్య కన్నా శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు మీడియా సమాచారం. రెస్టారెంట్ భవనం కూలి, పక్కనే ఉన్న భవనాలపై పడింది. దీంతో రెండు భవనాలు ఒరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, మధ్యప్రదేశ్ హోం మంత్రిని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తక్షణం సంఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు.

  • Loading...

More Telugu News