: సీసీ కెమెరాలకు చిక్కిన 'సూదిగాడు'!
గోదావరి జిల్లాల ప్రజలను వణికించిన సూదిగాడు పోలీసుల సీసీ కెమెరాకు చిక్కాడు. ఈ విషయాన్ని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు తెలిపారు. సూదిగాడు గురించి బాధితులు చెప్పిన వివరాల ప్రకారం సీసీ కెమెరాలో ఉన్న వ్యక్తికి, సూదిగాడికి పోలికలు కలిసాయని పోలీసులు చెబుతున్నారు. సీసీ ఫుటేజి సహాయంతో ఇంజక్షన్ సైకోను పట్టుకోగలిగామని అంటున్నారు. సూదిగాడు బ్లాక్ క్యాప్ ధరించి, బ్లాక్ హోండాపై తిరుగుతున్నాడని పోలీసులు వెల్లడించారు. కాగా, ఇతడిని పట్టుకునేందుకు 160 సీసీ కెమెరాలు, 49 చెక్ పోస్టుల వద్ద భారీ భద్రత ఏర్పాటుతో పాటు 400 మంది పోలీసులను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంచితే, శుక్రవారం నాడు భీమవరంలో బైక్ పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.