: హరీష్ రావు సభలో మహిళ ఆత్మహత్యా యత్నం... కలకలం
తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు సభలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మార్కెట్ యార్డ్ లో జరిగిన సభలో ఈ సాయంత్రం హరీష్ రావు ప్రసంగిస్తుండగా... ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. తనతో పాటు తెచ్చుకున్న ఓ ద్రావకాన్ని తాగింది. అనంతరం, తన భూమిని స్థానిక జడ్పీటీసీ సభ్యుడు ఆక్రమించుకున్నాడని... పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆమె గట్టిగా అరుస్తూ చెప్పింది. దీంతో, సభలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఆత్మహత్యకు యత్నించిన మహిళను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.