: భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణకు రంగం సిద్ధం
విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూసేకరణ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. రేపటినుంచి ఆ ప్రాంత రైతులకు నోటీసులు జారీ చేయనుంది. ఒకవేళ అభ్యంతరాలుంటే 60 రోజుల్లో రైతులు తెలియజేయవచ్చని సర్కార్ తెలిపింది. భోగాపురంలోని 1,205 కుటుంబాలను తరలించి, వారికి ప్రత్యేక గ్రామాలు ఏర్పాటు చేస్తామని చెప్పింది. రైతులు ఎయిర్ పోర్టుకు భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తే ల్యాండ్ పూలింగుకైనా సిద్ధమని వెల్లడించింది. భోగాపురంలో మొత్తం 5,311 ఎకరాల భూమి సేకరించేందుకు 48 మంది అధికారులను ప్రభుత్వం నియమించింది. ఇదిలాఉంటే భూసేకరణను వ్యతిరేకిస్తూ భోగాపురం స్థానికులు మరోపక్క నిరసన వ్యక్తం చేస్తున్నారు.