: మాయమైన మలేసియా నౌక దొరికింది


వారం రోజుల క్రితం దక్షిణ చైనా సముద్రంలో మాయమైన మలేసియా నౌక దొరికింది. దక్షిణ చైనా సముద్రంలో దొంగల హల్ చల్ ఎక్కువవడంతో నౌకను ఎవరో హైజాక్ చేసి ఉంటారని అధికారులు భావించారు. ఎంవీ సాహ్ లీనా అనే నౌకను తాన్ జాంగ్ బరమ్ కు 25 నాటికల్ మైళ్ల దూరంలో కనుగొన్నట్టు మలేసియా మారిటైమ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 2న నలుగురు భారతీయులు సహా 14 మందితో వెళ్లిన ఈ నౌకతో సెప్టెంబర్ 3న సంబంధాలు తెగిపోయాయి. దక్షిణ చైనాలో సముద్ర దొంగలు అధికంగా ఉన్నందున నౌక హైజాక్ అయి ఉంటుందని అధికారులు భావించారు. నౌక దొరకడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు, ఆ నౌకను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News