: ఒబామా నుంచి అవార్డు అందుకున్న ఝంపా లాహిరి


భారతీయ అమెరికన్ రచయిత్రి ఝంపా లాహిరి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. వైట్ హౌస్ లో జరిగిన కార్యక్రమంలో 2014 నేషనల్ హ్యూమనిటీస్ మెడల్ ను ఒబామా ఆమెకు అందజేశారు. ఝంపాతో పాటు ఒబామా నుంచి నేషనల్ హ్యూమనిటీస్ మెడల్ ను మరో 9 మంది అందుకున్నారు. తన సృజనాత్మక రచనల ద్వారా భారతీయ అమెరికన్ ల మనోభావాలను లాహిరి ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారని వైట్ హౌస్ పేర్కొంది. ఆమె రాసిన తొలి కథల సంకలనం 'ఇంటర్ ప్రెటర్ ఆఫ్ మాలడీస్'కి 2000 సంవత్సరంలో పులిట్జర్ అవార్డు లభించింది.

  • Loading...

More Telugu News