: సూదిగాడి వల్ల ఎలాంటి హాని లేదు: ఏపీ డీజీపీ
ఇంజెక్షన్ సైకో గురించి మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నప్పటికీ... అతని వల్ల ఎలాంటి హాని లేదని ఏపీ డీజీపీ రాముడు అన్నారు. సైకో చేస్తున్న ఇంజెక్షన్లతో జనాలు భయభ్రాంతులకు గురవుతున్న సంగతి వాస్తవమే అయినప్పటికీ... ఆ దాడుల్లో ఎవరూ గాయపడలేదని, అస్వస్థతకు లోను కాలేదని చెప్పారు. మరోవైపు, రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చాలా వరకు తగ్గిందని తెలిపారు. కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డిని విచారించిన అనంతరం... అతడిని సీఐడీకి అప్పగించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.