: వేలు విరిగడంతో బంగ్లా సిరీస్ కు దూరమైన ఆసీస్ వైస్ కెప్టెన్


అక్టోబర్ లో బంగ్లాదేశ్ లో జరిగే సిరీస్ కు ఆసీస్ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ దూరమయ్యాడు. యాషెస్ సిరీస్ సందర్భంగా లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో స్టీవ్ ఫిన్ వేసిన బౌన్సర్ బలంగా తగలడంతో వార్నర్ చిటికెన వేలు చితికిపోయింది. దీంతో వార్నర్ రిజర్వ్ బెంచ్ కి పరిమితమయ్యాడు. శస్త్ర చికిత్స అవసరం లేనప్పటికీ నాలుగు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో వార్నర్ దూరమైనట్టు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. దీనిపై వార్నర్ మాట్లాడుతూ, ఆసీస్ తరపున ఒక్క మ్యాచ్ కూడా మిస్సవ్వకుండా ఆడాలని భావించానని అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఆడలేకపోతున్నానని, వీలైనంత తొందర్లో కోలుకుంటానని తెలిపాడు. కాగా, బంగ్లా సిరీస్ లో ఆసీస్ రెండు టెస్టు మ్యాచ్ లు ఆడనుంది.

  • Loading...

More Telugu News