: ముంబై రైళ్ల బాంబు పేలుళ్ల కేసులో దోషుల నిర్ధారణ
ముంబై రైళ్ల బాంబు పేలుళ్ల కేసులో మోకా కోర్టు 12 మందిని దోషులుగా నిర్ధారించింది. అలాగే ఒకరిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. 2006 జులై 11న ముంబై రైళ్లలో బాంబు పేలుళ్లు జరిగాయి. ఉగ్రవాదులు ఆర్డీఎక్స్ ఉపయోగించి ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. మొత్తం ఏడు పేలుళ్లు జరగ్గా అన్నీ ఫస్ట్ క్లాస్ బోగీల్లోనే జరిగాయి. ఈ పేలుళ్లలో 188 మంది మరణించగా 829 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు సాగిన విచారణలో 192 మంది సాక్షులను కోర్టు ప్రశ్నించింది. ఈ రోజు పేలుళ్ల కేసులో దోషులను కోర్టు ప్రకటించింది.