: మోదీ స్వరాష్ట్రంలోని అహ్మదాబాద్ లో మాంసంపై నిషేధం
జైన్ మతస్థుల పవిత్రమైన రోజులు కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలో మాంసం అమ్మకాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ముంబై, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలలో ఇప్పటికే మాంసం విక్రయాలపై నిషేధం విధించగా, తాజాగా ఆ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కూడా చేరింది. వారం రోజుల పాటు మాంసం అమ్మకాలు నిషేధిస్తూ, అహ్మదాబాద్ పోలీసు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. గోవధను నిషేధిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. శ్వేతాంబర జైన్లు జరుపుకునే పర్యూషన్ పండుగ నేపథ్యంలోనే ఈ నిషేధం విధిస్తున్నట్టు పోలీసు అధికారులు చెప్పారు. మాంసం విక్రయాల నిషేధంపై అహ్మదాబాద్ లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.