: హైదరాబాదులో మళ్లీ స్వైన్ ఫ్లూ టెర్రర్... వ్యాధితో మహిళ మృతి


గతేడాది హైదరాబాదును వణికించిన ప్రాణాంతక వ్యాధి స్వైన్ ఫ్లూ మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే హైదరాబాదులో ఓ మహిళ మృతి చెందింది. చికిత్స పొందుతూ బాధితురాలు నాలుగు రోజుల క్రితమే చనిపోగా, ఆమె స్వైన్ ఫ్లూ కారణంగానే చనిపోయినట్లు వైద్యులు ఈరోజు నిర్ధారించారు. ఇక గాంధీ ఆసుపత్రిలో నేటి ఉదయం ఇద్దరు రోగులు స్వైన్ ఫ్లూ లక్షణాలతో చేరారు. మరోవైపు నగరంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా పెద్ద సంఖ్యలో రోగులు స్వైన్ ఫ్లూ లక్షణాలతో చేరుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది అనుభవాల నేపథ్యంలో స్వైన్ ఫ్లూ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగానే స్వైన్ ఫ్లూ ప్రబలుతున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News