: వాటర్ బాటిల్ లో పాము... ఛత్తీస్ గఢ్ సీఎంతో భేటీలో షాక్ తిన్న కేంద్ర ఆరోగ్య మంత్రి నద్దా


కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నద్దా నిన్న ఛత్తీస్ గఢ్ లో పర్యటించారు. ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తో భేటీ అయ్యారు. 'ప్రధాన మంత్రి మౌద్రిక్ యోజన'పై ఛత్తీస్ గఢ్ బీజేపీ ప్రధాన కార్యాలయం ఏకాత్మ పరిసర్ లో జరిగిన వీరి భేటీకి ఆ రాష్ట్ర బీజేపీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు సయ్యద్ అలీ అమన్ కుమారుడు సయ్యద్ షఫీఖ్ అమన్ కు చెందిన ‘అమన్ ఆక్వా’ వాటర్ ప్లాంట్ నుంచి వాటర్ బాటిళ్లు సరఫరా అయ్యాయి. భేటీలో నిమగ్నమైన రమణ్ సింగ్, జేపీ నద్దాలు తమ టేబుల్ పై ఉన్న ‘అమన్ ఆక్వా’ బాటిల్ ను చూసి షాక్ తిన్నారు. ఎందుకంటే, అక్కడ పెట్టిన ఓ బాటిల్ లో ఏకంగా ఓ పాము ఉందట!

  • Loading...

More Telugu News