: మోదీకి ఏం కావాలో ఎవరికీ తెలియదు!


భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఏం కావాలో ఎవరికీ తెలియదని పాకిస్థాన్ పత్రిక ఒకటి తన ఎడిటోరియల్ లో వ్యాఖ్యానించింది. పాకిస్థాన్ కు ఏం కావాలన్న విషయమై స్పష్టత ఉందని, అది మోదీ విషయంలో కొరవడిందని 'ది నేషన్స్' అభిప్రాయపడింది. పాకిస్థాన్ రేంజర్లు, భారత సరిహద్దు దళాల మధ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆ పత్రిక ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మోదీ విదేశీ విధానం ఆయనకు వ్యక్తిగతంగా పేరు తెచ్చిపెట్టిందని, ఇదే సమయంలో ఉపఖండంలో శాంతిని దూరం చేసిందని విమర్శలు గుప్పించింది. ఆయన నీడలో భారత విదేశాంగ శాఖ నడుస్తోందని ఆరోపించింది. పాక్ తో సత్సంబంధాలు నడపాలంటే హురియత్ పాత్ర ఎంతో ఉందన్న సంగతి తెలిసి కూడా, వారిని విస్మరించారని అంది. పాకిస్థాన్ ప్రతినిధులు ఏం మాట్లాడాలో కూడా మోదీయే డిక్టేట్ చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టింది. కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా ఆగుతోందంటే, కేవలం మోదీ కారణంగానేనని ఆరోపించింది.

  • Loading...

More Telugu News