: తమిళనాడులో తెలుగు భాషను బోధించాలి: మండలి ఛైర్మన్ చక్రపాణి


తమిళనాడులో తెలుగు భాష బోధనను కొనసాగించాలని ఏపీ శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి అన్నారు. ఈ మేరకు ఏపీ చట్టసభల్లో తీర్మానం చేసేందుకు కూడా యత్నిస్తామని చెప్పారు. తెలుగు భాష బోధనకు సంబంధించి అవసరమైతే తమిళనాడు గవర్నర్ రోశయ్య, ముఖ్యమంత్రి జయలలితతో మాట్లాడతానని కూడా చెప్పారు. దేశంలోని ప్రాచీన భాషల్లో తెలుగు కూడా ఒకటని... అందువల్ల తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. తమిళనాడులో నిర్బంధ తమిళ భాష బోధన చట్టం పట్ల అక్కడి తెలుగువారు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. తెలుగు చదువుకునే అవకాశాన్ని తమకు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే, తమిళనాడులో 42 శాతం మంది తెలుగువారే ఉన్నారు.

  • Loading...

More Telugu News