: రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వం హత్యలే: నాగం
కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నా, ప్రభుత్వంలో మాత్రం చలనం లేదని విమర్శించారు. రైతు సమస్యలను గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు విహారయాత్ర కోసం చైనా వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలు ముమ్మాటికీ ప్రభుత్వం చేస్తున్న హత్యలే అని ఆరోపించారు. కేసీఆర్ సొంత జిల్లాలోని ప్రతి గ్రామంలో కూడా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. రైతులకు వెంటనే కరవు భత్యం చెల్లించాలని డిమాండ్ చేశారు.