: తప్పు సరిదిద్దుకునే అవకాశమివ్వండి... కేశవరెడ్డి వేడుకోలు


తీవ్ర ఆర్థిక ఒడిదుడుకుల్లో కూరుకుపోయిన కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత ఎన్.కేశవరెడ్డి తన తప్పును ఒప్పుకున్నారు. వందల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన కేశవరెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సేకరించిన డిపాజిట్లను గడువు తీరినా తిరిగి ఇవ్వలేకపోయారు. ఈ క్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కర్నూలు సీసీఎస్ పోలీసులు నిన్న రాత్రి ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితం ఆయనను అరెస్ట్ చేసినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కేశవరెడ్డి తన తప్పును ఒప్పుకున్నారు. వేలాది మంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే క్రమంలో ఆర్థిక ఒడిదుడుకులు తప్పలేదని ఆయన చెప్పారు. అయితే వేలాది మందితో ముడివడి ఉన్న ఈ వ్యవహారంలో తన తప్పును సరిదిద్దుకునేందుకు తనకు చివరి అవకాశాన్ని ఇవ్వాలని ఆయన కోరారు. తనకున్న అప్పుల మేర ఆస్తులు కూడా ఉన్నాయని చెప్పిన కేశవరెడ్డి, ఇప్పటికిప్పుడు ఆస్తులన్నింటినీ అమ్మేయడం కుదరడం లేదన్నారు. కొంతకాలం సమయమిస్తే అప్పులన్నీ తీర్చేస్తానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News