: పాక్ క్రికెటర్ అఫ్రిదీతో శారీరక సంబంధం ఉంది: మోడల్, నటి అర్షిఖాన్


ప్రముఖ భారత మోడల్, నటి అర్షిఖాన్ మరో వివాదాల తుట్టెను కదిలించింది. పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీతో తనకు శారీరక సంబంధం ఉందని, అతనితో సెక్స్ లో పాల్గొన్నానని నిస్సిగ్గుగా ప్రకటించి వివాదానికి తెరలేపింది. అర్షిఖాన్, అఫ్రిదీలు ప్రేమాయణం సాగిస్తున్నారని, వీరి ప్రణయ కార్యకలాపాలకు వేదిక దుబాయ్ అంటూ గత కొంత కాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే, ఇంతకాలం ఈ వార్తలను ఖండిస్తూ వచ్చిన అర్షిఖాన్... తమ మధ్య సంబంధం ఉందని ఇప్పుడు తెగేసి చెప్పింది. "అఫ్రిదీతో శృంగారంలో పాల్గొన్నా. అది మా ఇద్దరికీ చెందిన అంశం. మా వ్యక్తిగతం. మా ఇద్దరి మధ్య ఎంతో ఘాటు ప్రేమ ఉంది" అని స్పష్టం చేసింది. తాను ఎవరితోనైనా పడుకోవడానికి మీడియా అనుమతి తీసుకోవాలా? అంటూ ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఆమె కింది విధంగా ట్వీట్ చేసింది... Yes, I had sex with Afridi! Do I need the Indian media's permission to sleep with someone? It's my personal life. For me it was love. మరో విషయం ఏమిటంటే... అఫ్రిదీకి ఇప్పటికే పెళ్లయింది. నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు అర్షిఖాన్ వెల్లడించిన విషయంతో, అతని వైవాహిక జీవితం ఇరుకున పడే ప్రమాదం లేకపోలేదు.

  • Loading...

More Telugu News