: తెలుగు తమ్ముళ్ల ఘర్షణ...ఐదుగురికి గాయాలు
శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం అవలంగి గ్రామంలో తెలుగు తమ్ముళ్లు ఘర్షణకు దిగారు. సాగునీటి సంఘం అధ్యక్ష ఎన్నికలు తెలుగు తమ్ముళ్లలో అగ్గిరాజేశాయి. తమ వర్గానికి చెందినవారే సాగునీటి సంఘం అధ్యక్షుడిగా నిలవాలంటూ రెండు వర్గాలుగా విడిపోయిన తెలుగు తమ్ముళ్లు ఎవరికి వారు పట్టుబట్టారు. దీంతో రెండు వర్గాలు పరస్పర రాళ్ల దాడికి దిగాయి. ఈ దాడుల్లో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిని పాలకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.