: నిరాహారదీక్షతో జగన్ సాధించేదేముంది?: ఏపీ మంత్రి రావెల


ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26వ తేదీ నుంచి గుంటూరులో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేయనున్నారు. ఈ దీక్షపై ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు తీవ్రంగా స్పందించారు. దీక్ష వల్ల జగన్ సాధించేది ఏముందని ఆయన ప్రశ్నించారు. గతంలో చేసిన దీక్షల వల్ల జగన్ ఏమైనా సాధించారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు జగన్ చేపడుతున్న దీక్ష కూడా అలాంటిదే అని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళుతోందని... అది చూసి వైకాపా, కాంగ్రెస్ పార్టీలు ఓర్వలేకపోతున్నాయని రావెల మండిపడ్డారు.

  • Loading...

More Telugu News