: బీహార్ ఎన్నికల షెడ్యూల్ వివరాలు... అక్టోబర్ 12న తొలిదశ ఎన్నిక... నవంబర్ 8న ఫలితాలు
ఐదు విడతల్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు భారీ స్థాయిలో షెడ్యూల్ విడుదలైంది. ప్రస్తుత బీహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 29తో ముగుస్తుండగా.. తొలిదశ ఎన్నిక అక్టోబర్ 12న ప్రారంభమవుతుంది. నవంబర్ 8న ఫలితాలను ఫలితాలు ప్రకటిస్తారు. తొలిదశకు.. ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్లకు చివరితేదీ 23, పరిశీలన 24, ఉపసంహరణకు 26గా నిర్ణయించించారు. ఇక ఎన్నికలు అక్టోబర్ 12న జరగనున్నాయి. రెండో దశకు.. సెప్టెంబర్ 21 నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్లకు చివరితేదీ 28, పరిశీలన 29, ఉపసంహరణకు అక్టోబర్ 1గా నిర్ణయించారు. అక్టోబర్ 16న ఎన్నికలు జరుగుతాయి. మూడో దశకు.. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదలైతే, నామినేషన్లకు చివరితేదీ 8, పరిశీలన 9, ఉపంసహరణకు 12గా నిర్ణయించారు. ఎన్నికలు 20వ తేదీన జరుగుతాయి. నాలుగోదశకు.. అక్టోబర్ 7న నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్లకు చివరితేదీ 14, పరిశీలన 15, ఉపసంహరణ 17గా నిర్ణయించారు. ఎన్నికలు నవంబర్ 1న జరుగుతాయి. ఐదో దశకు.. అక్టోబర్ 8 నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్లకు చివరితేదీ 15, పరిశీలన 17, ఉపంసహరణకు 19గా నిర్ణయించగా, ఎన్నికలు నవంబర్ 5న నిర్వహిస్తారు. ఇక ఓట్ల లెక్కింపు, ఫలితాలు నవంబర్ 8 జరుగుతాయి.