: మేత కోసం వచ్చిన మేకలను అమ్ముకున్న పోలీసులు
ఎవరేమనుకుంటే మాకేంటి సిగ్గు... అన్నట్టు ఉంటుంది కొంత మంది పోలీసుల వ్యవహార శైలి. ఖాకీల ప్రవర్తనపై పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్నా... వారు మాత్రం తీరు మార్చుకోవడం లేదు. తాజాగా ఇలాంటి సిగ్గుమాలిన ఘటనే నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దొంగలుగా మారారు. మేత వెతుక్కుంటూ పోలీస్ స్టేషన్ లోకి వచ్చిన మేకలను పట్టుకున్న పోలీసులు వాటిని రూ. 20 వేలకు అమ్ముకున్నారట. దీంతో గత్యంతరం లేని మేకల యజమాని జిల్లా ఎస్సీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు విచారణ జరపగా... నిజంగానే పోలీసులు మేకలు అమ్ముకున్నారని తేలింది. ఈ విషయం తెలిసిన జనాలు మాత్రం మేకలను దొంగతనం చేసే వీళ్లా మనకు రక్షణ కల్పించేది? అని నవ్వుకుంటున్నారు.