: సౌదీ జరిపిన దాడుల్లో భారతీయులెవరూ చనిపోలేదు: విదేశాంగ శాఖ


యెమెన్ లో సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో 20 మంది భారతీయులు చనిపోయారనే వార్తతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. అయితే 13 మంది భారతీయులు క్షేమంగానే ఉన్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరో ఏడుగురు కనిపించడం లేదని... వారు కూడా క్షేమంగానే ఉంటారని తెలిపింది. యెమెన్ లో భారత్ కు దౌత్య కార్యాలయం లేకపోవడంతో... సమాచార సేకరణ కొంచెం నెమ్మదిగా జరుగుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో యెమెన్ లో సంక్షోభం తలెత్తినప్పుడు అక్కడి భారతీయులను స్వదేశానికి తరలించి, దౌత్య కార్యాలయాన్ని కూడా మూసివేశారు.

  • Loading...

More Telugu News