: టెస్టులకు గుడ్ బై చెప్పిన మరో ఆస్ట్రేలియా క్రికెటర్
యాషెస్ సిరీస్ లో ఘోర వైఫల్యం నేపథ్యంలో, ఆసీస్ క్రికెటర్లు ఒక్కొక్కరుగా టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నారు. ఇప్పటికే మైఖేల్ క్లార్క్, షేన్ వాట్సన్ తదితరులు ఐదు రోజుల క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. తాజాగా ఈ రోజు ఆసీస్ వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ బ్రాడ్ హాడిన్ కూడా టెస్ట్ క్రెకెట్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించాడు. 37 ఏళ్ల హాడిన్ ఇకపై సిడ్నీ సిక్సర్స్ తరపున టీ20లు మాత్రమే ఆడతానని ప్రకటించాడు. గత మే నెలలోనే వన్డేలకు హాడిన్ గుడ్ బై చెప్పాడు. ఇంగ్లండ్ లో జరిగిన యాషెస్ సిరీస్ లో బ్యాట్స్ మెన్ గా విఫలమయ్యానని... పరుగులు చేయాల్సిన బాధ్యత తనపై ఉన్నప్పటికీ చేయలేకపోయానని... అందుకే రిటైర్ కావాలనే తుది నిర్ణయానికి వచ్చానని అతను తెలిపాడు. మొత్తం 66 టెస్టులు ఆడిన హాడిన్ 270 వికెట్ల పతనంలో పాలుపంచుకున్నాడు. 3266 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.