: తప్పుచేశానని ఒప్పుకుంటున్నా: హిల్లరీ క్లింటన్


అమెరికా మాజీ విదేశాంగ మంత్రి, ప్రస్తుతం ఆ దేశ అధ్యక్ష పదవికి బరిలో ఉన్న అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తప్పు చేశానని ఒప్పుకున్నారు. తాను విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు న్యూయార్క్ లోని తన నివాసంలో ప్రైవేట్ ఈ-మెయిల్ సర్వర్ వినియోగించినందుకుగానూ ఆమె క్షమాపణలు చెప్పారు. ఏబీసీ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హిల్లరీ మాట్లాడుతూ, తప్పు చేశానని ఒప్పుకుంటున్నానన్నారు. అందుకుగానూ క్షమాపణలు చెబుతున్నానని, పూర్తి బాధ్యత తనదేనని తెలిపారు. ఈ ఏడాది మార్చిలో హిల్లరీ ప్రైవేట్ ఈ-మెయిల్ సర్వర్ విషయం బయటపడింది. దాంతో తీవ్ర విమర్శలు, ఆరోపణలు వచ్చి ఆమెపై ఒత్తిడి పెరిగినప్పటికీ తన చర్యను సమర్థించుకుంటూ వచ్చారు. క్షమాపణ చెప్పేందుకు పలుమార్లు విస్మరించారు. ప్రభుత్వం అనుమతి మేరకే ప్రైవేట్ ఈ-మెయిల్ సర్వర్ పెట్టుకున్నానని చెప్పారు. అయితే ఎట్టకేలకు హిల్లరీ ఈ వివాదంపై క్షమాపణలు కోరడం గమనార్హం.

  • Loading...

More Telugu News