: ఢిల్లీలో ‘గల్లీ క్రికెట్’తో సందడి చేసిన విరాట్ కోహ్లీ!
టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ విజయంతో స్వల్ప వ్యవధిలోనే తొలి సిరీస్ విజయాన్ని నమోదు చేశాడు. దీంతో ఆనందంతో కేరింతలు కొడుతున్న కోహ్లీ ప్రస్తుతం తన సొంత నగరం ఢిల్లీలో కాస్తంత రెస్ట్ తీసుకుంటున్నాడు. మొన్న ప్యాడ్స్, హెల్మెట్, గ్లోవ్స్ లేకుండానే అతడు క్రీజులోకొచ్చేశాడు. అది కూడా మైదానంలో కాదండోయ్, ఢిల్లీ వీధుల్లో గల్లీ క్రికెట్ ఆడాడు. ఢిల్లీ వీధుల్లో చిన్నారులతో కలిసి బ్యాటు చేతబట్టిన కోహ్లీ పిల్లల్లో ఉత్సాహాన్ని నింపడమే కాక, తనకు దొరికిన విరామ సమయాన్ని అతడు ఇలా ఎంజాయ్ చేశాడు.