: మన జలాశయాల్లో నీటిమట్టం ఇదే!


గత కొద్ది రోజులుగా పడుతున్న వర్షాలకు పలు జిల్లాల్లోని వాగులు, వంకలు, చిన్న నదులు వరద నీటితో పొంగి పొరలుతుంటే ప్రధాన జలాశయాలకు నీటి ప్రవాహం పెరిగి జలకళతో కనిపిస్తున్నాయి. సుంకేసుల జలాశయానికి 45 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 54 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనికి అదనంగా కర్నూలు జిల్లా తాగునీటి అవసరాల నిమిత్తం 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక శ్రీశైలం విషయానికి వస్తే, నేటి ఉదయం ఇన్ ఫ్లో 53,74 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యామ్ మొత్తం నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 799.10 అడుగుల నీటిమట్టం ఉంది. మరో వారం పది రోజులు ఇదే ప్రవాహం కొనసాగితే, డ్యామ్ పూర్తి స్థాయిలో నిండుతుందని అధికారులు వివరించారు.

  • Loading...

More Telugu News