: ఢిల్లీలో హోటళ్లు, రెస్టారెంట్లకు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తప్పనిసరి: మంత్రి సత్యేందర్


దేశ రాజధాని ఢిల్లీలో హోటళ్లు, రెస్టారెంట్లు తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవడంతో పాటు ఫుడ్ సేఫ్టీ లైసెన్సును కలిగి ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒక నెల లోగా ఈ సర్టిఫికెట్ తీసుకోని హోటళ్లు, రెస్టారెంట్లపై తగిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది. ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ కల్తీ ఆహార పదార్థాలు అమ్మకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. నిబంధనలు అతిక్రమించిన సదరు యజమానులపై చర్యలు తప్పవన్నారు. హోటళ్లు, రెస్టారెంట్ల వారు ఆన్ లైన్ విధానంలో లైసెన్స్ లు పొందాలని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News