: సరిహద్దు దళాలకు అందుబాటులో శాండ్ స్కూటర్లు
సరిహద్దు దళాలకు శాండ్ స్కూటర్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో రాజస్ధాన్ సరిహద్దుల్లోని ఎడారి ప్రాంతాలలో పహారా కాయడం మరింత సులభం కానుంది. రెండు శాండ్ స్కూటర్లను ప్రయోగాత్మకంగా బీఎస్ఎఫ్ దళాలు అందుబాటులోకి తెచ్చాయి. వీటి వినియోగం పరిశీలించిన అనంతరం మరిన్నింటిపై నిర్ణయం తీసుకోనున్నారు. జైసల్మేర్, బర్మేర్ లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద రాత్రి వేళల్లో గస్తీ కాయడం కష్టమవుతోంది. పగలు ఒంటెలపై వెళ్లి పహారా కాస్తున్నప్పటికీ, రాత్రుళ్లు ఒంటెలపై వెళ్లడం కష్టంగా మారుతోంది. దీంతో శాండ్ స్కూటర్లను బీఎస్ఎఫ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కో స్కూటర్ పై నలుగురు సైనికులు కూర్చునే అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ స్కూటర్లకు ఉండే బలమైన బీమ్ లైట్ ఎక్కువ కాంతిని వెదజల్లుతుంది. దీంతో దూరంగా ఏం జరుగుతుందో గమనించే అవకాశం ఉంది.