: ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అంగ్ సాన్ సూకీ


మయన్మార్ ప్రతిపక్ష నాయకురాలు అంగ్ సాన్ సూకీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. సోషల్ మీడియా ద్వారా ఆమె తొలి సందేశాన్ని వీడియో రూపంలో విడుదల చేశారు. ఈ సాధారణ ఎన్నికలు తమ దేశానికి చాలా ముఖ్యమైనవని, కీలకమైన మలుపు అని ఆమె వీడియో సందేశంలో పేర్కొన్నారు. బర్మీన్, ఇంగ్లీషు భాషలలో ఆమె మాట్లాడారు. ఈ సాధారణ ఎన్నికల్లో అక్కడ 90 పార్టీలు పోటీ చేయనున్నాయి. ఇంచుమించు 50 ఏళ్ల పాటు మిలటరీ పాలనలో మగ్గిన మయన్మార్ లో 1990లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్ డీ) పార్టీ 59 శాతం సీట్లను గెలుచుకుంది. దీనిని జీర్ణించుకోలేకపోయిన మిలటరీ ప్రభుత్వం ఆమెను రెండు దశాబ్దాలు గృహనిర్బంధంలో ఉంచింది. అయితే, దేశంలోనే కాకుండా విదేశాల నుంచి కూడా విపరీతమైన ఒత్తిడి రావడంతో ఆమెను 2011లో విడుదల చేశారు. రాజ్యాంగంలోని వివాదాస్పద క్లాజ్ కారణంగా ఆమె అధ్యక్షపదవికి పోటీ చేయడం సాధ్యం కాదు. కాగా, 2011లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అది మిలటరీ కనుసన్నల్లో నడుస్తోంది. దీంతో ఈసారి జరిగే ఎన్నికలైనా పూర్తి ప్రజాస్వామ్యయుతంగా జరుగుతాయా? అనే అనుమానం అందర్లోనూ నెలకొంది.

  • Loading...

More Telugu News