: తమిళనాడులో మరో 'అమ్మ' పథకానికి శ్రీకారం
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. జయను అందరూ ముద్దుగా పిలుచుకునే 'అమ్మ' పేరుతోనే ఈ పథకాన్ని ప్రారంభించారు. కొత్తగా జన్మించిన పిల్లలకు, వారి తల్లుల కోసం 'అమ్మ బేబీ కేర్ కిట్' పేరుతో పథకాన్ని తీసుకొచ్చారు. గతేడాది ఆగస్టులో అసెంబ్లీ వేదికగా తమిళనాడు సీఎం జయలలిత ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద రాష్ట్ర సచివాలయంలో ఐదుగురు మహిళలకు బేబీ కేర్ కిట్ అందజేసినట్టు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా తువ్వాలు, బెడ్, ఒక జత దుస్తులు, దోమ తెర, రుమాలు, 100 ఎమ్ఎల్ ఆయిల్, 60 ఎమ్ఎల్ శాంపు, సబ్బుపెట్టె, ఒక సబ్బు, బొమ్మ తదితర వస్తువులు ఈ కిట్ లో ఉన్నాయి.