: రెండు రాష్ట్రాల మధ్య 'రసగుల్లా' గొడవ!


రసగుల్లా వంటకం మాదంటే మాదంటూ పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు గొడవ పడుతున్నాయి. ఈ విషయంలో న్యాయనిర్ణేతగా తమిళనాడుకి బాధ్యతలు అప్పగించాయి. ఇందుకు సంబంధించి తగిన ఆధారాలు ఉన్న డాక్యుమెంట్లను తమిళనాడుకు పశ్చిమ బెంగాల్ సర్కార్ పంపింది. బెంగాల్ మంత్రి సాషి పాంజా మాట్లాడుతూ రసగుల్లా ఏ రాష్ట్రానికి చెందుతుందో చెప్పడానికి తమిళనాడు ఇంత సమయం ఎందుకు తీసుకుంటోందో అర్థం కావట్లేదని అన్నారు. పరిశోధకుడు, రచయిత అయిన హరిపాద భౌమిక్ రచించిన రసగుల్లా అనే పుస్తకంలో రాసిన మాటలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ వంటకం తమదంటూ ఒడిశా చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని అందులో పేర్కొన్నారు అని అన్నారు. రసగుల్లాపై తమిళనాడు ఇచ్చే తుది నివేదిక కోసం రెండు రాష్ట్రాలతో పాటు, ఆ పుస్తక రచయిత కూడా ఎదురుచూస్తున్నారు.

  • Loading...

More Telugu News