: అత్యాచారానికి గురైన జాతీయస్థాయి క్రీడాకారిణి


ఢిల్లీలో ఒక జాతీయ స్థాయి క్రీడాకారిణి అత్యాచారానికి గురైన ఘటన కొంచెం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే గత నెలలో ఢిల్లీకి సమీపంలో ఉన్న గుర్గావ్ లోని బిలాస్ పూర్ లో ఓ జాతీయ స్థాయి జూడో క్రీడాకారిణి అత్యాచారానికి గురయింది. ఈ ఘటనకు సంబంధించి కాస్త ఆలస్యంగా స్థానిక మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సదరు క్రీడాకారిణిపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. మరొక నిందితుడి కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News